PRATHIDWANI: కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పుందా.. ఎలాంటి జాగ్రత్తలు అవసరం? - prathidwani debate on corona third wave
కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. వైరస్ పుట్టిందని భావిస్తున్న చైనాలో ప్రాంతాల వారీగా మరోసారి లాక్‌డౌన్లు ప్రారంభమయ్యాయి. రష్యా, బ్రిటన్లలో గుర్తించిన ప్రదేశాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. అంతర్జాతీయంగా విమాన ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుకుంటున్న పరిస్థితుల్లో.. మళ్లీ కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలోనూ కొత్త రకం కొవిడ్ వేరియంట్ అక్కడక్కడా ఉనికిలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో దేశానికి మరో వేవ్ ముప్పు ఉందా? ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.