ప్రతిధ్వని: సంప్రదాయ దేశంలో అంతిమ సంస్కారాలకు అవరోధాలా? - corona changed final journey
మరణించిన మనిషికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడం మన సంప్రదాయం. కరోనా సృష్టించిన కల్లోలంలో ఇప్పుడా సంస్కారం సారం కోల్పోతోంది. కళ్లముందే కావాల్సిన మనిషి మృతదేహం పడిఉన్నా... పట్టింపులేనట్లు పక్కకు జరుగుతున్న ధోరణి పెరుగుతోంది. ఇక అనాథలు, యాచకులు, నిరుపేదల మృతదేహాలైతే అంత్యక్రియల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి. కరోనా భయాలు, అపోహలు, అయిన వారి నిర్లక్ష్యం కారణంగా కొవిడ్ మృతులు కనీస మర్యాదకు నోచుకోవడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఏఏ అంశాల్లో చొరవ తీసుకోవాలి? సభ్య సమాజం సామాజిక బాధ్యత ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.