ప్రతిధ్వని: అభాగ్యులకు అండగా నిలుస్తోన్న ఆపన్నహస్తాలు - telangana varthalu
చీకట్లో చిరుదీపం! నిస్సహాయ స్థితిలో అందే సాయం గురించి ఈ మాట చెబుతుంటారు. కరోనా కమ్మిన సంక్షోభంలో అభాగ్యులకు అండగా నిలుస్తోన్న ఆపన్నహస్తాలు... అదే మాట మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఆకలి తీర్చే వారు కొందరు! అవసరంలో ఆసరాగా నిలిచే వారు మరికొందరు. నా అన్నవాళ్లు లేని అంతిమసంస్కారాల్లో ఆ నలుగురూ తామవుతున్న మనసున్న మారాజులు ఇంకొంతమంది. రోజు మార్చి రోజు... కేసులు.., మరణాలు..., కరోనా రోగుల కష్టానష్టాలు వినివినీ బరువెక్కిన గుండెలకు కాస్తంతా ఊరట కలిగిస్తున్నాయి... పౌర సమాజ ప్రతినిధులు చేపడుతున్న కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు. వారి సేవకు సలాం అనేలా చేస్తున్నాయి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.