తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: వణుకు పుట్టిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి - కరోనా వైరస్​ వార్తలు

By

Published : Apr 16, 2021, 9:19 PM IST

హమ్మయ్య..! ఇక కరోనా ముప్పు దాదాపుగా తొలగినట్లే...! వ్యాక్సిన్ల రాకతో ప్రభుత్వాలు, ప్రజలు ఊపిరి పీల్చుకుని, అనుకున్న మాటలివి. కానీ ప్రస్తుత పరిస్థితి మరోసారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గతేడాది ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా...రెండోదశగా తన విశ్వరూపం చూపుతోంది. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆసుపత్రుల్లో పడకలు సరిపోని దైన్యం, వ్యాక్సిన్లు, పరీక్షలు, మందులు...ఇవేవీ పెద్దగా మార్పు చూపని పరిస్థితి ఓవైపు..ఓ దఫా దేశాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తలకిందులు చేసిన లాక్‌డౌన్ పట్ల ప్రభుత్వాల్లో నెలకొన్న జంకు మరోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో మహమ్మారిని ఎదుర్కునేందుకు స్వీయజాగ్రత్తలు పాటించడమే మనచేతిలో ఉన్న ఆయుధం. ఈ ఆయుధాన్ని సమర్థంగా వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్న నేపథ్యంలో... మనముందున్న తక్షణ కర్తవ్యాలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details