ప్రతిధ్వని: కరోనా ఊబిలో చిన్న పరిశ్రమలు - జీడీపీపై కరోనా ప్రభావం
దేశంలో చిన్న పరిశ్రమలు కరోనా కబంధ హస్తాల్లో చిక్కుతున్నాయి. వెంబడిస్తున్న కొవిడ్ కష్టాలతో తలపడుతూ బలహీనపడుతున్నాయి. ఇప్పటికే కరోనాతో పోరాటంలో చితికిపోయిన వేలాది సూక్ష్మ, చిన్న పరిశ్రమలు మూసివేతకు దగ్గరవుతున్నాయి. జీడీపీలో ముఫ్పై శాతం వాటా కలిగి, 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం నానాటికీ కుదేలవుతోంది. కష్టకాలంలో ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు చిన్న పరిశ్రమల్ని ఆదుకుంటున్నాయా? లాక్‌డౌన్ భయాలను అధిగమించి ఈ రంగం ముందడుగు వేస్తుందా? ఆపత్కాలంలో విపత్తును జయించే మార్గాలేంటి? ఈ అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.