ప్రతిధ్వని: ఆర్థిక వ్యవస్థకు చికిత్స.. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం
2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కరోనా కాటుకు దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన తరుణంలో దానికి చికిత్సను అందించే సాధనంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ గురించి చెప్పుకున్నారు. అలాగే ప్రధానమంత్రి కూడా కరోనా కోసం ఇప్పటికే ప్రకటించినటువంటి ఆత్మ నిర్భర్ ప్యాకేజీకి ఇదొక పొడిగింపని ఆయన కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఈ బడ్జెట్ గట్టెక్కించగలుగుతుందా?.. నిజంగానే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే విధంగా కేటాయింపులు జరిగాయా?.. అనే అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.