తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: ఓటీటీ వినోదమా..? విశృంఖలమా? - ప్రతిధ్వని

By

Published : Feb 13, 2021, 10:21 PM IST

డిజిటల్ పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో వినోద రంగంలో దూసుకొచ్చిన నూతన ఆవిష్కరణే.. ఓటీటీ ఫ్లాట్​ఫాం. సినిమాలు, వెబ్ సిరీస్​లు, లఘు చిత్రాలు, ఈవెంట్ ప్రదర్శనలకు ఇవి రెడీమెడ్ వేదికలుగా నిలుస్తున్నాయి. డిజిటల్ యుగంలో వినియోగదారులకు చౌకగా వినోదాన్నందించటం ఓటీటీల సానుకూలాంశమైతే... అశ్లీలత, అసభ్యత విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్నాయి. సినిమా, టీవీ రంగాల్లో అయితే ప్రసారాల నియంత్రణకు సెన్సార్ బోర్డులు, అంబుడ్స్​మెన్ కమిటీలు వంటి పటిష్ఠ పర్యవేక్షణ వ్యవస్థలున్నాయి. కానీ.. ఓటీటీల నిర్వహణలో మాత్రం వాటి జాడే లేదు. ఈ క్రమంలో ఓటీటీలపై చెలరేగిన కొన్ని వివాదాలు.. వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చకు దారితీశాయి. ఈ అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details