ప్రతిధ్వని : 15వ ఆర్థిక సంఘం వెయిటేజీ విధానంతో తీరని నష్టం.! - ఈనాటి ప్రతిధ్వని
15వ ఆర్థిక సంఘం సిఫార్సులు పార్లమెంట్ ముందుకు వచ్చాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 15వ ఆర్థిక సంఘం మధ్యంతర రిపోర్టును పార్లమెంట్ ముందుంచారు. 14వ ఆర్థిక సంఘం తరహాలోనే రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల వాటాను 42 శాతంగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. పన్నుల వాటా శాతాన్ని పక్కన పెడితే.. వాటాల పంపిణీలో జరుగుతున్న అసమతుల్యతను రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. ఈసారి సిఫార్సుల్లో వెయిటేజీ విధానం ద్వారా తమిళనాడు మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆర్థిక సంఘం ప్రామాణికంగా తీసుకుంటున్న అనేక అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.