తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ పరిస్థితి ఎందుకు అదుపు తప్పుతోంది? - PRATHIDWANI LATEST VIDEOS

By

Published : Oct 26, 2021, 9:38 PM IST

జమ్ముకశ్మీర్‌లో ఏం జరుగుతోంది? కొద్ది రోజులుగా జాతీయ స్థాయిలోనే కాదు.. ప్రపంచదేశాలు చాలా చోట్ల ఈ మాట చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో శాంతిస్థాపన దిశగా అడుగులేస్తోంది. అలజడి, అస్థిరతలు చేసిన గాయాలకు అభివృద్ధి మంత్రంతో మందు వేసే ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడే మరోసారి కుట్రలు, కుయుక్తులకు తెరలేపాయి.. ముష్కరమూకలు. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ.. శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి. ప్రతిగా సైన్యం ముష్కరుల ఏరివేతను ముమ్మరం చేసింది. ఉగ్రవాదాన్ని సహించేది లేదనే హెచ్చరికతో పాటు.. శాంతి స్థాపనకు కశ్మీర్‌ సమాజంతో చర్చలకు సిద్ధమన్న హోంమంత్రి ప్రకటన కేంద్ర వైఖరిని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details