తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI: గంజాయి సాగు, అక్రమ రవాణా మూలాలు ఎక్కడున్నాయి? - ప్రతిధ్వని వీడియోలు

By

Published : Oct 25, 2021, 10:35 PM IST

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. గంజాయి ముఠాల ఆచూకీ కనిపెట్టి, అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో స్మగ్లర్లు పోలీసులపైనే దాడికి దిగారు. ప్రతిగా జరిగిన పోలీసుల కాల్పుల్లో.. ఇద్దరికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఇప్పటికీ రోడ్డు, రైలు, సముద్ర మార్గాల్లో రవాణా అవుతున్న గంజాయి ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది. మరోవైపు 30 రోజుల ప్రణాళికతో తెలంగాణ పోలీసులు, ఆబ్కారీ శాఖ సంయుక్తంగా చేపట్టిన మూకుమ్మడి తనిఖీల్లో భారీగా గంజాయి బయటపడుతోంది. మాదకద్రవ్యాల ముఠాలు పోలీసులూ చేతికి చిక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు గంజాయి సాగును అరికట్టడంలో వైఫల్యం ఎక్కడ జరుగుతోంది? మత్తు ముఠాలు నిర్భయంగా ఎలా వ్యాపారం చేస్తున్నాయి? గంజాయి నిరోధానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మధ్య ఎలాంటి సమన్వయం అవసరం ? ఇదే అంశంపై ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details