Live Video: ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి మరీ యువకుడ్ని ఢీకొట్టిన జీపు - jeep footpath accident
🎬 Watch Now: Feature Video
దిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటి, ఫుట్‌పాత్‌పైకి ఎక్కుతున్న వ్యక్తిని ఓ జీపు వేగంగా వచ్చి ఢీకొట్టగా.. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జన్‌పథ్ రోడ్లో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాహనాన్ని పక్కకు మళ్లించేందుకు లేదా బ్రేక్ వేసేందుకు ఏమాత్రం ప్రయత్నించకుండా, ఫుట్‌పాత్‌పైకి ఎక్కి మరీ ఆ వ్యక్తిని ఢీకొట్టి పరారైన దృశ్యాలు చూసి స్థానికులు షాక్ అయ్యారు. వెంటనే బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధరించారు. మృతుడ్ని 39 ఏళ్ల గిరిధారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు సేకరించి.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST