'మన కోళ్లలో కరోనా వైరస్ లేదు.. నిర్భయంగా తినొచ్చు' - సురేష్‌రాయుడు చిట్టూరి
అమెరికా నుంచి కోడి కాళ్ల (చికెన్ లెగ్స్) దిగుమతిపై పన్ను మరింత తగ్గిస్తే... దేశ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటుందని పౌల్ట్రీ రంగ నిపుణుడు, అంతర్జాతీయ ఎగ్ కౌన్సిల్ అధ్యక్షుడు సురేష్ రాయుడు చిట్టూరి హెచ్చరించారు. దాదాపు 10 కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోళ్ల దాణా అయిన మొక్కజొన్న, సోయా సాగు అవుతోన్న లక్షల ఎకరాల పంటలపై ఈ ప్రభావం పడి రైతులు సంక్షోభంలో చిక్కుకుంటారన్నారు. వచ్చే 20 ఏళ్లలో పౌల్ట్రీ, డెయిరీ రంగాలు దేశంలో 20 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాయని అంచనా వేశారు. మన కోళ్లలో కరోనా వైరస్ ఏ మాత్రం లేదని, నిర్భయంగా చికెన్, గుడ్లు తినవచ్చని సూచించారు. ఇవి తినటం ద్వారా కరోనా వైరస్‌ను శరీరం మరింత సమర్థంగా ఎదుర్కొంటుందంటోన్న సురేష్ రాయుడితో ముఖాముఖి.
Last Updated : Mar 1, 2020, 12:26 PM IST