వరదలో చిక్కుకున్న యువకుడు.. హెలికాఫ్టర్‌తో సాయం - hours-long flow at Khuntaghat Dam in Bilaspur
వరద ప్రవాహంలో చిక్కుకున్న ఓ వ్యక్తిని వాయుసేనకు చెందిన హెలికాఫ్టర్ ద్వారా రక్షించారు అధికారులు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పుర్ జిల్లా కోటా ప్రాంతంలో జరిగింది. ఖుతాఘాట్ ఆనకట్టను సందర్శించటానికి వచ్చిన ఓ యువకుడు అకస్మాత్తుగా ఆ ప్రవాహంలో పడిపోయాడు. వరదలో కొంత దూరం కొట్టుకుపోయిన తర్వాత నది మధ్య భాగంలో ఉన్న చెట్టును పట్టుకొని ఆ యువకుడు అక్కడే ఉండిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణాధికారులు రాత్రి వేళ అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు.