తెలంగాణ

telangana

ETV Bharat / videos

మందుకొట్టి కొండచిలువతో ఆటలు- ఓ పెగ్ వేస్తావా అంటూ కబుర్లు - కేరళ న్యూస్​

By

Published : Feb 9, 2022, 7:17 PM IST

Young man show with Python: మద్యం మత్తులో జీతు అనే ఓ యువకుడు కొండచిలువతో ఆటలాడుతూ హల్​చల్​ చేశాడు. పైథాన్​ను స్కూటర్​ వెనుక సీటుపై ఎక్కించుకుని వీధుల్లో తిరిగాడు. మధ్యలో ఆగి కొండచిలువను ప్రమాదకరంగా పట్టుకుని, మెడకు చుట్టుకున్నాడు. పైథాన్​కు ఆహారం తినిపించి, మద్యం తాగుతావా అంటూ కబుర్లు చెప్పాడు. కేరళ కోజికోడ్ జిల్లా ముచుకున్నులో ఫిబ్రవరి 1న జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ అయింది. ఇది చూసిన పెరువణ్నమూళి ఫారెస్ట్ రేంజ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కోయిలాండి ఠాణాకు వెళ్లి జీతు వివరాలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details