'మిగ్'తో ఆకాశవీధిలో అదరగొట్టిన అభినందన్ - ఆధునిక యుద్ధ విమానాలతో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు
ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్ వేదికగా 87వ వైమానిక దళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆధునిక యుద్ధ విమానాలతో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో చేసిన విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. బాలాకోట్ దాడుల అనంతరం పాకిస్థాన్‌తో జరిగిన వైమానిక ఘర్షణలో అద్భుత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్... మిగ్ బైసన్ యుద్ధ విమానంతో విన్యాసాలు చేశారు.
TAGGED:
on AirForceDay today