బావిలో పడిన ఏనుగు.. రోజంతా అందులోనే..
కేరళ- కొత్త మంగళంలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బావిలోపడి బయటకు వచ్చేందుకు తీవ్ర అవస్థలు పడింది. నది సమీపంలోని ఓ బావిలో పడిన అయిదేళ్ల ఏనుగు బురదలో కూరుకుపోయింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించి, ఎట్టకేలకు ఆ ఏనుగును బయటకు తీశారు. అనంతరం ఆ గజరాజు నది దాటి అవతలికి వెళ్లిపోయింది.