తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆర్టీసీ బస్సుపై ఏనుగు దాడి.. అద్దం పగులగొట్టి.. - ఏనుగు బస్సు దాడి

By

Published : Sep 27, 2021, 4:33 PM IST

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ప్రయాణికుల బస్సుపై ఏనుగు దాడి (Elephant Attack Video) చేసింది. కర్ణాటకలోని చామరాజనగర్‌ సమీపంలోని గుండ్లుపేటె నుంచి తమిళనాడులోని నీలగిరికి బస్సు (Elephant Attack Bus) వెళ్తుండగా అడ్డగించింది. అడవుల్లో నుంచి రహదారికి మీదకు వచ్చిన గజరాజు.. ఎదురుగా వస్తున్న తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుపైకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ బస్సును వెనక్కి మళ్లించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఏనుగు తన దంతాలతో అద్దాన్ని ధ్వంసం చేసింది. భయపడిన డ్రైవర్ తన సీటులో నుంచి లేచి ప్రయాణికుల వద్దకు వెళ్లిపోయాడు. దాదాపు అరగంట సమయం రోడ్డుపైనే ఉన్న ఏనుగు అనంతరం అడవుల్లోకి వెళ్లిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత బస్సు గమ్యస్థానానికి పయనమైంది.

ABOUT THE AUTHOR

...view details