అక్కడ ప్రసాదం కోసం గుడికి ఎలుగుబంట్లు
ఎలుగుబంటి అనగానే భయపడి దూరంగా వెళతాం. మనుషులపై భల్లూకాల దాడి ఘటనలు చాలా చూశాం. కానీ ఒడిశాలోని నుఆపాడా జిల్లాలో ఎలుగుబంట్లు మనుషులతో స్నేహం చేస్తున్నాయి. జిల్లాలోని సర్దార్ ప్రాంతంలో కొండపై ఉన్న దేవాలయానికి అడవిలోని ఎలుగులు వస్తాయి. అక్కడికి వచ్చే భక్తులపై దాడి చేయకుండా వారు ఇచ్చే ప్రసాదాలను ఆరగిస్తుంటాయి. వారితో సరదాగా గడుపుతుంటాయి.