ఇసుక తుపాను ధాటికి అనేక కంప్యూటర్లు ధ్వంసం - ఈరోజు తుఫాను హెచ్చరిక
రాజస్థాన్ జోధ్‌పుర్ జిల్లా ఫలోదీలో మంగళవారం ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి శ్రీసర్పుర గ్రామంలోని రాజీవ్‌గాంధీ సేవా కేంద్రంలో కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. ఫలోదిలో చెట్లు, వందలాది విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. ఈ తుపాను చూసి స్థానికులు భయంతో వణికిపోయారు.