బంగాల్లో తృణమూల్, ఎస్ఎఫ్ఐ కార్యకర్తల ఘర్షణ - A clash erupted allegedly between Trinamool Congress (TMC) and Students' Federation of India (SFI)
కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. బంగాల్లో ఆందోళనలు మిన్నంటాయి. బర్ధమాన్లో తృణమూల్, ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. మరి కొన్ని చోట్ల ఆందోళనకారులు బస్సు అద్దాలు పగులకొట్టి విధ్వంసం సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా 'భారత్ బంద్' నిర్వహిస్తున్నట్లు ట్రేడ్ యూనియన్లు స్పష్టం చేశాయి.