ఉగ్రరూపం దాల్చిన జలపాతం- ప్రజలు బెంబేలు! - ఉత్తరాఖండ్లో వర్షాలు
ఉత్తరాఖండ్ ముస్సోరీలో(Rains in Uttarakhand) కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడి.. కెమ్టీ జలపాతం(Kempty falls) ఉగ్రరూపం దాల్చింది. కొండ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న.. వరద నీటితో జలపాతం ఉప్పొంగుతోంది. కెమ్టీ నుంచి భారీగా కిందకు దూకుతున్న వరదతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఆ ప్రాంతంలోని దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలపాతం నుంచి భారీ ఎత్తున నీరు కిందకు జాలువారుతున్నందున పర్యటకులను అనుమతించటం లేదని పోలీసులు తెలిపారు.