వైరల్: పోలీస్‌ను చితకబాదిన గ్రామస్థులు - Chhatarpur police beaten by villagers
మధ్యప్రదేశ్ ఛతర్పుర్లోని గ్రామస్థులు ఓ పోలీస్‌ను చితకబాదారు. అతడు స్థానికంగా ఓ యువకుడిని కొట్టాడన్న ఆరోపణల నేపథ్యంలో.. ఈ దాడి చేశారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి మరీ కర్రలతో విరుచుకుపడ్డారు. మే 28న లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా.. తమపై పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించాడని గ్రామస్థులు తెలిపారు.