శీతాకాలం అతిథులతో సూరత్‌కు కొత్తశోభ - migratory birds in india
అరుదైన అతిథుల ఆగమనంతో గుజరాత్‌లోని సూరత్ నగరం నూతన శోభను సంతరించుకుంది. ఎగిరొచ్చిన వలసపక్షుల కిలకిలరావాలతో సూరత్ వీధుల్లో సందడి నెలకొంది. శీతాకాలంలో ఏటా వచ్చే అతిథులే అయినప్పటికీ 2020 సంవత్సరం మిగిల్చిన చేదుజ్ఞాపకాల నడుమ సుదూరం నుంచి తిరిగివచ్చిన స్నేహితుడి రాకతో అక్కడి ప్రజానీకం ఉపశమనం పొందుతున్నారు. ఉత్తర ఆసియాలోని పలు ప్రాంతాల నుంచి సూరత్ చేరుకున్న వలస పక్షులు జంతు ప్రేమికులకు, సూరత్ వాసులకు కనువిందు చేస్తున్నాయి.