కదులుతున్న రైలు నుంచి దిగబోయి.. - రైలు నుంచి కిందపడిన మహిళ
కదులుతున్న రైలు నుంచి దిగబోయిన ఓ మహిళ.. ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై.. మహిళను రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి లాగారు. దీంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది ఆమె. కర్ణాటకలోని శివమొగ్గ రైల్వే స్టేషన్లో బుధవారం ఈ ఘటన జరిగింది.