పట్టుకున్న పాము కాటేసి వృద్ధుడు మృతి - కర్ణాటక యాదగిరి జిల్లాలో పాములు పట్టేవ్యక్తి మృతి
పట్టుకున్న పాము కాటు వేయడంతో వృద్ధుడు మృతిచెందిన ఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగింది. వాడ్గెరా తాలుకా గోడిహలా గ్రామానికి చెందిన వృద్ధుడు బసవరాజు పూజారికి గ్రామంలోకి వచ్చిన పాములను పట్టుకునే అలవాటు ఉంది. అలా పట్టుకున్న పాములను గ్రామం చివరికి తీసుకెళ్లి వదలిపెడుతుంటాడు. అదే మాదిరిగా శనివారం తన ఇంటిలోకి ప్రవేశించిన పామును పట్టుకున్న.. బసవరాజు గ్రామం బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆ సర్పం ఐదు సార్లు కాటు వేసింది. విషం శరీరమంతటా వ్యాపించడంతో చేతిలో పాము ఉండగానే అతడు ప్రాణాలు విడిచాడు.