అలలతో ముందుకు సాగని పడవ.. ఆ కొత్త జంట ఏం చేసింది? - వరుడు భుజాలపై వరుడు
వరద నీటిలో నడవడానికి ఇబ్బంది పడిన నవ వధువును భుజాలపై మోసుకుంటూ నదిని దాటించాడు ఓ వరుడు. పెళ్లివారు అందరు ఉండగా.. ఎలాంటి నామూషీ లేకుండానే భార్య బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు. భద్రంగా ఆమెను అవతలి ఒడ్డుకు చేర్చాడు. కొద్ది రోజులుగా బిహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కిషన్‌గంజ్‌లోని కంకై నది వద్ద వరద నీరు ఎక్కువగా చేరింది. దీంతో పెళ్లి బృందం తిరుగు ప్రయాణానికి పడవను అద్దెకు తీసుకుంది. అలలు ఎక్కువగా రావడం వల్ల పడవ ప్రయాణం కొంతమేరకే పరిమితం అయ్యింది. దీంతో వరుడు.. నవ వధువును భుజాలపై మోసుకుని ఒడ్డు దాటించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.