వరదలో చిక్కిన యువకుడ్ని కాపాడిన వాయుసేన - ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ నదిలో చిక్కుకున్న ఓ యువకుడిని చాకచక్యంగా రక్షించింది భారత వైమానిక దళం(ఐఏఎఫ్). బిలాస్‌పుర్‌లోని రతన్‌పుర్ ప్రాంతంలో గల ఖుతాఘాట్ డ్యామ్ సమీపంలో నీటిలోకి దూకాడో వ్యక్తి. ప్రవాహ ఉద్ధృతి అంతకంతకూ పెరగడం వల్ల.. ఎటూ వెళ్లలేక దగ్గరలోని చెట్లకొమ్మలను పట్టుకొని బిక్కుబిక్కుమంటూ నీటిలోనే ఉండిపోయాడు. సహాయక చర్యలు చేపట్టిన ఐఏఎఫ్.. రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దింపింది. హెలికాప్టర్ నుంచి కిందకు ఓ తాడును వేలాడదీసి.. దాని ద్వారా ఓ సిబ్బంది కిందకు వచ్చి.. బాధితుడిని కాపాడారు.