కుటుంబ సభ్యులే హత్యకు ప్రయత్నించి.. చివరికి.. - కుటుంబ సభ్యుల హత్య
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కడోల్కర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తమ సొంత కుటుంబంలోని మరో వ్యక్తిని దారుణంగా కొట్టి, ఆపై హత్య చేయడానికి యత్నించారు. కుటుంబ కలహాలతో.. అయినవారే అతడిని భవనం నుంచి కిందకు తోసేందుకు ప్రయత్నించారు. బాధితుడి అరుపులు విన్న ఇరుగు పొరుగువారు భవనం ముందు గుమికూడటం వల్ల.. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అతడిని వెనక్కి లాగారు. కడేబజారా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడం గమనార్హం. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.