హైవేపై అర్ధరాత్రి మొసలి హల్చల్- జనం పరుగులు.. - మొసలి
కర్ణాటకలో నడిరోడ్డుపై బుధవారం అర్ధరాత్రి భారీ మొసలి (Crocodile Viral Video) హల్చల్ చేసింది. బాగల్కోట్ జిల్లా అనగవాడి బ్రిడ్జి వద్ద హూబ్లీ-షోలాపుర్ జాతీయ రహదారిపైకి వచ్చిన మొసలి.. ప్రజలను భయాందోళనలకు (Crocodile Viral News) గురిచేసింది. రోడ్డుపైనే 3 నిమిషాల పాటు ఉన్న మొసలిని చూసి.. వాహనదారులు, పాదచారులు పరుగులు తీశారు. ఆల్మట్టి డ్యాం బ్యాక్‌వాటర్స్‌లో చాలా మొసళ్లు ఉన్నాయి. గతంలో అనగవాడి బ్రిడ్జి వద్దే మొసళ్ల దాడికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు.