ఖతర్నాక్ దొంగ.. చుట్టూ జనం ఉన్నా జేబులోని మొబైల్ మాయం! - pick pocketing phone
Pick Pocketing Phone: చుట్టూ జనం ఉన్నా ఓ వ్యక్తి దగ్గర సెల్‌ఫోన్ దొంగతనం చేశాడో దుండగుడు. మెడికల్ షాప్‌లో మందులు తీసుకుంటున్న వ్యక్తి చొక్కా పైజేబులో నుంచి అతనికి తెలియకుండానే మొబైల్ కొట్టేశాడు. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్‌లోని మహిద్పుర్ గ్రామంలో జరిగిందీ ఘటన. సీసీటీవీలో నమోదైన సంబంధిత దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ చోరీపై పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.