తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో: పోలీసుపై దాడి చేసిన గేదె - Watch: Buffalo attacks policeman in UP's Sambhal

By

Published : Aug 31, 2020, 10:41 AM IST

క్రూరమృగాలకే కాదు సాధు జంతువులకు కూడా.. అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది. ఆ కోపంలో అవి చేసే పనులు.. మనుషుల ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు ఉన్నాయి. అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగింది. రోడ్డు మీద నిల్చొని ఉన్న ఓ గేదె అటు వైపుగా ఓ వాహనంపై వస్తున్న.. ఓ పోలీసుపై ఆకస్మాత్తుగా దాడి చేసింది. ఆయన కింద పడినప్పటికీ..వదలకుండా కొమ్ములతో కుమ్మేయాలని ప్రయత్నించింది. స్థానికులు వెంటనే స్పందించి గేదెను అదిలించడంతో అక్కడి నుంచి పారిపోయింది. సమయానికి స్థానికులు స్పందించడం వల్ల ఆ పోలీసు... స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details