Viral Video: కెనాల్ నుంచి పైకి వచ్చేందుకు గజరాజుల ఫీట్లు - ఏనుగులు
అడవి నుంచి వచ్చిన ఓ ఏనుగులు గుంపు.. సాగు నీటి కెనాల్లోకి దిగింది. నీటిలో సేదతీరుతున్న గజరాజులను చూసిన కొందరు బిగ్గరగా అరవటం ప్రారంభించారు. దీంతో భయపడిన ఏనుగులు కాలువ నుంచి పైకి ఎక్కేందుకు ప్రయత్నించాయి. కానీ, గట్లు సిమెంట్వి కావటం వల్ల పలుమార్లు విఫలమయ్యాయి. కెనాల్ నుంచి పైకి వచ్చేందుకు గజరాజులు చేసిన ప్రయత్నాలను తమ ఫోన్లలో బంధించారు స్థానికులు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ సంఘటన కర్ణాటక మైసూర్ జిల్లాలోని హునసురు తాలుకా నెల్లూరు పాలా గ్రామంలో జరిగింది. నాగరహోల్ జాతీయ పార్క్ నుంచి ఈ ఏనుగులు బయటకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.