Viral video: బాటిల్‌తో పాలు తాగిన ఏనుగు - Elephant drinking milk with bottle video
బాటిల్‌తో ఏనుగు పాలు తాగడం ఎప్పుడైనా చూశారా? మనిషి చేయితో సీసా, గ్లాసు పట్టుకుని తాగినట్లే ఈ గజరాజు కూడా తొండంతో బాటిల్‌ను పట్టుకుని గడగడా తాగేస్తుంది. దీనికి సంబంధించిన 11 సెకన్ల వీడియోను షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.