ఇళ్లల్లోకి దూరిన ఎలుగుబంట్లు.. ప్రజల్లో భయాందోళనలు - ఎలుగు బంట్ల బీభత్సం
ఒడిశా మల్కాన్‌గిరి జిల్లాలో అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లో.. వన్యప్రాణులు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. తరచూ ఏనుగుల గుంపు గ్రామాల్లోకి రావడం సహజం కాగా ఇప్పుడు ఎలుగుబంట్లు కూడా వస్తున్నాయి. ఆయా గ్రామాల ప్రజలకు కునుకులేకుండా చేస్తున్నాయి. కొన్నిరోజులుగా తమ్సా పంచాయతీలోని ఎంవీ-7 గ్రామంలో రాత్రివేళ ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. పలు ఇళ్ల గోడలను ఎలుగుబంట్లు ధ్వంసం చేస్తున్నాయి. ఇటీవలే ఒక ఇంటిలోకి దూరిన రెండు ఎలుగుబంట్లు వంటగదిలో ఆహారం మొత్తం తినేశాయని ఇంటి యజమాని వాపోయారు. మంట చూపి బెదిరిస్తే అవి పారిపోయినట్లు చెప్పారు. ఎలుగుబంట్లు గ్రామంలోకి రాకుండా అటవీశాఖ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Last Updated : Dec 21, 2021, 12:44 PM IST