రవాణా సౌకర్యం లేక డోలీపై 13 కి.మీ.. - రోడ్డురవాణా సౌకర్యాలు లేవు
సాంకేతికపథంలో దేశం దూసుకుపోతున్నా..చాలా గ్రామాలకు కనీసం రోడ్డు రవాణా సౌకర్యాలు లేని దుస్థితి. అలాంటి ఊర్లలో ఎవరికన్నా అత్యవసర పరిస్థితి వచ్చిందంటే అంతే సంగతులు. కర్ణాటక చామరాజనగర్ జిల్లాలోని పడిసలత గ్రామంలోని మహాదేవమ్మ అనే మహిళ అనారోగ్యం బారిన పడింది. గ్రామానికి రోడ్డురవాణా సౌకర్యాలు లేవు. దాంతో డోలి కట్టి అమెను భుజాలపై 13 కిలోమీటర్లు మోసుకెళ్లి వైద్యం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.