ముంచెత్తిన వరద.. పడవలో వచ్చిన వధూవరులు - పడవలో నవజంట
భారీవర్షాలు మహారాష్ట్రను ముంచెత్తాయి. సాంగ్లీ నగరంలోని నూతన వధూవరులకూ వరద కష్టాలు తప్పలేదు. నగరంలోని కాలనీలన్నీ వరద నీటితో మునిగిపోయిన నేపథ్యంలో.. పడవపైనే ఇంటికి విచ్చేశారు వధూవరులు. వర్షాల కారణంగా వరుడి గ్రామంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో వధువును పడవలోనే అత్తారింటికి తీసుకొచ్చాడు వరుడు. వీరు పడవలో వచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.