చెత్త విషయంలో గొడవ- యువకుని చేయి నరికిన మహిళ
చెత్తను ఓ స్థలంలో పారేసే విషయంలో మహిళ, యువకుని మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన ఆ మహిళ యువకుని చేతిపై కత్తితో ఒక్క వేటు వేసింది. దాంతో చేయి తెగిపడింది. ఈ ఘటన కేరళ ఇడుక్కి జిల్లా అనక్కరలో జరిగింది.