రోడ్డు పక్కనున్న వ్యక్తులపైకి దూసుకెళ్లిన లారీ - తమిళనాడు తాజా వార్తలు
కంటైనర్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇద్దరి వైపు దూసుకొచ్చింది. గమనించిన ఆ వ్యక్తులు పక్కకు తప్పుకున్నారు. దాంతో పెనుప్రమాదం తప్పింది. అయితే అక్కడే ఉన్న ద్విచక్ర వాహనాన్ని లారీ నుజ్జునుజ్జు చేసింది. ఈ ఘటన కేరళ-కోయంబత్తూర్ సరిహద్దులోని వయళూర్లో జరిగింది.