తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైరల్: నదిలో కొట్టుకుపోయిన బొలెరో - బొలెరో వైరల్ వీడియో

By

Published : May 27, 2021, 2:29 PM IST

యాస్ తుపాను ప్రభావం ఝార్ఖండ్​లోని అనేక జిల్లాల్లో కనిపించింది. లతేహర్ జిల్లా ధార్ధారి నదిలో బొలెరో వాహనం చిక్కుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తుపు హెస్లా గ్రామానికి సమీపంలో నదిని దాటుతుండగా ఒక్కసారిగా వరద పెరిగింది. స్థానికుల సహకారంతో వాహనంలో ఉన్న వారందరూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ నదిపై వంతెన లేనందున వరదలు వచ్చిన ప్రతిసారీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details