జాతీయ రహదారిపై భారీగా విరిగిపడిన కొండచరియలు - 58వ జాతీయ రహదారి
ఉత్తరాఖండ్‌లోని తోతా ఘాటి వద్ద రిషికేశ్-శ్రీనగర్‌ను కలిపే 58వ జాతీయ రహదారిపై ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా రహదారి మూసుకుపోయి.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతకుముందే జారీ చేసిన ప్రమాద హెచ్చరికలతో వాహనాలను నిలిపేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ ఫోనుల్లో రికార్డు చేశారు.