దంచికొట్టిన వర్షం- స్తంభించిన జనజీవనం - ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు
ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాదూన్ను వరదలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి దాదాపు ఐదు గంటలపాటు భారీ వర్షం కురవడం వల్ల వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రహదారులపై వరద నీరు చేరడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. దుకాణాలు, ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ ఐటీ పార్కులో వరద నీటిలో చిక్కుకున్న 12 మందిని విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు.