తెలంగాణ

telangana

ETV Bharat / videos

Live accident: కారును ఢీకొన్న లారీ.. ఆటో నుజ్జునుజ్జు - ఉత్తరాఖండ్‌ నేర వార్తలు

By

Published : Sep 10, 2021, 12:29 PM IST

ఉత్తరాఖండ్‌ ఉధమ్ సింగ్ నగర్ జిల్లా బాజ్‌పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ప్రధాన రహదారిని దాటేందుకు ఓ ఆటో రాంగ్​ రూట్​లో వేచిచూస్తోంది. అదే సమయంలో ఆటో ముందునుంచి ఓ కారు వస్తోంది. దీనివెనుక వేగంగా వస్తున్న ఓ లారీ అదుపుతప్పి ముందున్న కారును ఢీకొట్టింది. దీనితో కారు ఆటోను ఢీకొట్టి డివైడర్​ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటోడ్రైవర్ వసీమ్​ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా కనిపించాయి.

ABOUT THE AUTHOR

...view details