రైతులతో కలిసి రైల్లో భోజనం చేసిన తోమర్ - కేంద్ర వ్యవసాయ చట్టాలు
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులతో కలిసి ఆదివారం భోజనం చేశారు. మధ్యప్రదేశ్లోని మురైనా పర్యటన కోసం రైలులో ప్రయాణించిన తోమర్.. రైతులతో కలిసి భోజనం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. మంగళవారం.. కేంద్రం మరోసారి రైతులతో చర్చలు జరపనున్న నేపథ్యంలో వారితో కలిసి మంత్రి తినడం ప్రాధాన్యం సంతరించుకుంది.