బుల్ ఫెస్టివల్లో ఎద్దుల వీరంగం.. ప్రేక్షకులపైకి దూసుకెళ్లి.. - హవేరీ బుల్ ఫెస్టివల్
కర్ణాటకలోని హవేరీ జిల్లా గుట్టల్ గ్రామంలో ఎద్దులు బీభత్సం (Bull Race Karnataka) సృష్టించాయి. బుల్ ఫెస్టివల్లో భాగంగా స్థానికులు ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని ఎద్దులు ప్రేక్షకుల మీదకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. ఎద్దుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మైలారప్ప గాజీ సహా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో రెండు ఎద్దులు కూడా గాయపడ్డాయి.