live murder video viral: వ్యాపారి దారుణ హత్య.. తుపాకులతో ఒక్కసారిగా.. - వ్యాపారి దారుణ హత్య
Jind Murder Live: హరియాణాలోని జింద్ జిల్లాలో ఓ సిమెంట్ వ్యాపారిని కొందరు దుండగులు కాల్చి చంపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని మేనల్లుడుపై కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందగా.. మేనల్లుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనకు పాత పగలే కారణమని పోలీసులు తెలిపారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. చనిపోయిన వ్యాపారి శ్యామ్ సుందర్.. ఓ కేసులో సాక్షిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పై పలు సార్లు ఈ తరహా దాడులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.