తృణమూల్, భాజపా కార్యకర్తల గొడవ.. లాఠీఛార్జ్ - video of cooch behar clash
బంగాల్లో భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. కూచ్‌బెహర్ జిల్లాలోని తుఫాన్గంజ్లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు ఒకరిని ఒకరు దూషించుకున్నారు. అనంతరం ఇరువర్గాలు రాళ్లురువ్వుకోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటుతుంది అని భావించిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని భాజపా నేతలు రోడ్లపై బైఠాయించారు.