బస్సు ముందు చిందులేస్తూ యువతి టిక్‌టాక్ వీడియో - యువతి టిక్‌టాక్ వీడియో
ప్రయాణికులు నిండుగా ఉన్న ఓ బస్సు ముందు టిక్‌టాక్ చేసింది మహారాష్ట్రకు చెందిన ఓ యువతి. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పుణెలో రోడ్డుపైనే.. ప్రభుత్వ బస్సును ఆపి దాని ముందే ఓ బాలీవుడ్ పాటకు చిందులేసింది. హదాప్సార్-భెక్రైనగర్ మార్గంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే రవాణా మార్గాలలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి యువతి నేరానికి పాల్పడిందని పుణె పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.