Tigress Sultana: రోడ్డుపై 'సుల్తానా' చక్కర్లు- పర్యటకులు థ్రిల్ - పార్కులో పులి
Tigress Sultana: రాజస్థాన్లోని రణ్థంభోర్ జాతీయ పార్కులో పర్యటకులకు అరుదైన అనుభవం ఎదురైంది. సరదాగా సాగుతున్న వారి ప్రయాణంలో.. ఆడపులి సుల్తానా తారసపడింది. అడవి పర్యటనలో భాగంగా పర్యటకులు జోన్ నంబర్ 1 నుంచి జోన్ నంబర్ 5కు వెళ్తుండగా వారికి.. సుల్తానా కనిపించింది. పొదల్లో నుంచి బయటకు వచ్చిన పులి పర్యటకుల వాహనాలు ఉండగానే రోడ్డు దాటి వెళ్లింది. పది నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. పర్యటకులు తమ మొబైల్ ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్గా మారాయి.