Tiger Chase Tourist Jeep: జీపును వెంబడించిన పులి- పర్యటకుల గుండె గుభేల్! - tiger chase jeep
Tiger Chase Tourist Jeep: రాజస్థాన్లోని రణ్థంభోర్ జాతీయ పార్కులో సుల్తానా అనే పులి పర్యటకులను హడలెత్తించింది. టూరిస్టులు ప్రయాణిస్తున్న రెండు జీపులను అడ్డగించింది. పర్యటకులు ఫొటోలు తీసుకుంటుండగా.. వారి వాహనాలను వెంబడించింది. దీంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. డ్రైవర్లు వాహనాలను చాకచక్యంగా వెనుకకు మళ్లించగా.. పులి కొద్ది దూరం జీపు వెంట పరుగెత్తి ఆగిపోయింది. దీంతో పర్యటకులు ఊపిరి పీల్చుకున్నారు.
Last Updated : Jan 3, 2022, 11:42 AM IST