దారుణం: మూడేళ్ల బాలుడిపై దూసుకెళ్లిన కారు - 3 years old boy dead in an accident near sarawati modren school ludhiana
పంజాబ్ లూథియానాలో కారు డ్రైవరు నిర్లక్ష్యం మూడేళ్ల బాలుడిని బలిగొంది. స్కూలు బ్యాగు, చేతిలో బుట్టతో పరిగెత్తుకుంటూ రోడ్డు దాటాలనుకున్న ఆ చిన్నారి.. కారు కింద పడి క్షణాల్లో విగతజీవుడయ్యాడు. చిన్నారిని ఢీకొట్టానని తెలిసినా.. కనీసం దిగి చూడకుండా, ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. అక్కడి నుంచి తప్పించుకున్నాడు కారు డ్రైవర్. మరోవైపు అంత చిన్న బాలుడిని ఒంటరిగా బయటకు ఎలా పంపిస్తారని స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ.. ధర్నా చేస్తున్నారు కుటుంబసభ్యులు.
Last Updated : Mar 1, 2020, 8:15 PM IST